ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఉప సభాపతి పద్మారావు గౌడ్..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణకు ప్రతీకగా దీపావళి నిలిస్తుందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. ఈ దీపావళి తెలంగాణకు విజయాల వరుస కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆశకు, జ్ఞానానికి, ఆనందానికి ,వికాసానికి, విజయాలకు ప్రతిరూపం దీపావళి అని ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తిల శోభావాళి అని, ఎన్నో విజయోత్సవ చరిత్రలను కలిగిన దివ్య చరితావళి ఈ దీపావళి అని పద్మారావు గౌడ్ అన్నారు. ప్రజలందరికీ సకల శుభాలు, శాంతి సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు అందాలని,ప్రతి ఇంటా ఆనందపు కాంతులు వెదజల్లాలని , అజ్ఞానాంధకారాలు తొలగి విజ్ఞానపు వెలుగులు, ఆనంద దివ్వెలు వెలగాలని ఆయన ఆకాంక్షించారు. మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఉప సభాపతి పద్మారావు గౌడ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.