కెసిఆర్ని ఫామ్ హౌస్ కు పంపిన కరోనా..

కెసిఆర్ని ఫామ్ హౌస్ కు పంపిన కరోనా..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొరోనాను నియత్రించేందుకు తగు జాగ్రత్తలు  తీసుకుంటోంది. అయినా కూడా కరోనా విలయతాండవం ఆడుతోంది. అయితే తాజగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. నిన్న జ్వరం ఒళ్ళు నొప్పులతో బాధపడిన కెసిఆర్. ఈ రోజు కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. కెసిఆర్ కు కరోనా లక్షణాలు అత్యల్పంగా ఉండటంతో వైద్యులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఈ క్రమంలో కెసిఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కెసిఆర్ ఆరోగ్యాన్ని వైద్య బృందం ఎప్పటికి అప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొన్న సాగర్ ఎన్నికల నేపథ్యంలో తనతో పాటు ఉన్న వారంతా టెస్టులు చేయించుకొని తగు జాగ్రత్తులు తీసుకోవాలని సూచించారు. కెసిఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు బులిటన్ విడుదల చేస్తామని సిఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.