షర్మిల పార్టీలోకి కౌశిక్ రెడ్డి?
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలం సృష్టించిన పాడి కౌశిక్ రెడ్డి ఆడియో కాల్. ఒక్క ఆడియో కాల్ తో తన రాజకీయ జీవితం ప్రశ్నార్ధకంగా మారింది. ఆ ఆడియో కాల్ బయటపడి ఉండకపోతే ఈపాటికి కౌశిక్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకునేవారు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆడియో కాల్ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అటు వేరే పార్టీలోకి వెళ్లలేక కౌశిక్ రెడ్డి మధ్యలోనే ఉండిపోయారు. ఇంత జరిగిన అధికార తెరాస పార్టీ కౌశిక్ రెడ్డి ని ఆహ్వానిస్తారా? ఒకవేళ ఆలా కౌశిక్ రెడ్డి ని తెరాస పార్టీలోకి తీసుకుంటే ప్రజలు ఆ పార్టీని నమ్ముతారా? ఇప్పటికే తెరాస పార్టీపై రాష్ట్రంలో కొంత మేరకు వ్యతిరేకత మొదలైనట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హుజురాబాద్ నుండి రాబోయే ఉప ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి కి తెరాస పార్టీ నుండి టికెట్ లభిస్తే ప్రజలు పార్టీని అభ్యర్థిని నమ్మే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.
కౌశిక్ రెడ్డిని ఆడియో కాల్ నేపథ్యంలో ఎవరు ప్రశ్నించిన అది సబ్జెక్టు కాదు అంటూ మాట మారుస్తూ వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఏ రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తారు ఇంత జరిగిన తర్వాత కౌశిక్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి ఏ పార్టీ ముందుకు వస్తుంది. లేక పోతే కౌశిక్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుంటారా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా కౌశిక్ రెడ్డి తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన పార్టీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తన రాజకీయ కార్యాచరణ గురుంచి తొందర్లోనే ప్రకటిస్థానని ఇదివరకే ఒక ప్రెస్ మీట్లో వెల్లడించారు. కానీ ఆ తర్వాత కౌశిక్ రెడ్డి మీడియా ముందుకు రాలేదు.