ప్రెస్‌క్లబ్ వద్ద పోసానికి వ్యతిరేకంగా జనసేన నేతల నినాదాలు..

ప్రెస్‌క్లబ్ వద్ద పోసానికి వ్యతిరేకంగా జనసేన నేతల నినాదాలు..

ఆర్.బి.ఎం హైదరాబాద్‌: సోమాజీగూడ ప్రెస్‌‌క్లబ్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ దర్శకుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ స్టేట్ జనసేన యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వాహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రెస్‌క్లబ్ దగ్గరకు భారీ చేసుకున్నారు. పోసాని ప్రెస్‌మీట్ కొనసాగుతుండగానే పవన్ అభిమానులు ప్రెస్‌క్లబ్ వద్దకు భారీగా చేరుకున్నారు. పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు పవన్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్‌తో పాటు పలువురిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరికునేది లేదని లక్ష్మణ్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published.