పులిమామిడిలో ఘనంగా వినాయక నిమజ్జనం..

పులిమామిడిలో ఘనంగా వినాయక నిమజ్జనం..

ఆర్.బి.ఎం పులిమామిడి: నవాబిపేట్ మండల్ పులిమామిడి గ్రామంలో వినాయక నిమజ్జనం కోలాహలంగా సాగింది. సాంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గణేషుడి శోభాయాత్ర జరిగింది. గ్రామంలోని చిన్న, పెద్ద వయస్సు వారు సందడిగా నృత్యాలు చేస్తు బొజ్జగణపయ్యను గంగ ఒడికి చేర్చారు. శోభయాత్రలో ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం పులిమామిడి గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. బొజ్జగణపయ్యను గంగ ఒడికి చేర్చిన అనంతరం గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published.