హైదరాబాద్: హైదరాబాద్ లో పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రజలు అల్లాడిపోయారు. మంగళవారం కూడా నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, కూకట్ పల్లి, యూసఫ్ గూడ, అమీర్ పేట, ఎస్సార్ నగర్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతబాద్, సోమాజీగూడ, కోఠీ, ఆబిడ్స్, మెహిదీపట్నం, మసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, ప్యారడైజ్, ప్యాట్నీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్లో పలుచోట్ల కుండపోత వర్షం..
