దళిత బంధులా.. గౌడ బంధు పథకం ప్రవేశపెట్టాలి..

దళిత బంధులా.. గౌడ బంధు పథకం ప్రవేశపెట్టాలి..

ఆర్.బి.ఎం. డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళితుల కోసం దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిన విధంగానే నిరుపేద గౌండ్ల కోసం గౌడ బంధు పథకం ప్రవేశపెట్టాలని వరంగల్ అర్బన్ జిల్లా కమలపూర్ లో గౌడ కులస్తులు నిరసన తెలిపారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం గౌడ కులస్తులు అంబెడ్కర్ విగ్రహాన్నికి వినతి పత్రం అందజేశారు.

గౌడ కులస్తులు మాట్లాడుతూ.. రేపు(సోమవారం)హుజురాబాద్ లో జరగబోయే సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ బంధు పథకం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గౌడ కులంలో కూడా నిరుపేదలు ఉన్నారని, గౌడ బంధు పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద గౌడ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని గౌడ్ కులస్తులు కోరారు.

హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు పథకం అమలు చేయాలని ప్రకటించారో అదేవిధంగా గౌడ్ బంధు కూడా అమలు చేయాలని గౌడ కులస్తులు కోరారు. ఆకాశాన్ని అంటుకొని ఉండే చెట్టును రోజు ఎక్కితేగాని కడుపు నిండా గౌడ కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వం ఇది గుర్తించాలని వారు అన్నారు.

ఎన్నికల సమయంలో కేసీఆర్ గౌడ కులస్తులకు ద్విచక్ర వాహనాలు ఇస్తామని చెప్పారు కానీ నేటి వరకు ఆ హామీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని వెంటనే అర్హులైన గౌడలకు ద్విచక్ర వాహనాలు మంజూరు చేయాలని గౌడ కులస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

Leave a Reply

Your email address will not be published.