గోల్డెన్ టెంపుల్ ను దర్శించుకున్న హర్యానా గవర్నర్, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి జనార్దన్ రెడ్డి ..

గోల్డెన్ టెంపుల్ ను దర్శించుకున్న హర్యానా గవర్నర్, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి జనార్దన్ రెడ్డి ..

ఆర్.బి.ఎం: హర్యాన గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులు సిక్కుల పవిత్ర క్షేత్రమైన అమృతసర్‌ను దర్శించుకున్నారు చండీఘడ్ నుండి ప్రత్యేక హెలీకాఫ్టర్లో అమృత్సర్ చేరుకున్నారు. అధికారులు, సిక్కుమత పెద్దలు గవర్నర్ కుటుంబ సభ్యులకు ఘనంగా ఆహ్వానం పలికారు. సిక్కు సంప్రదాయాల ప్రకారం దత్తాత్రేయ, జనార్దన్‌రెడ్డి ప్రత్యేక పూజులు నిర్వహించారు. గోల్డెన్ టెంపుల్ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందించారు. దత్తాత్రేయ వినాయక చవితి రోజు ఖైరతాబాద్ గణేషున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి జనార్దన్ రెడ్డి మాట్లాడుతు ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని త్వరితగతిన పూర్తిగా నశించి ప్రజలందరూ ఆరోగ్యాలుతో జీవించాలని, కరోనాను అంతం చేయాలని ప్రార్ధించానని జనార్దన్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published.