బీసీ కమిషన్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభప్రద్ పటేల్ ను సన్మానించిన BCJAC హైదరాబాద్ ప్రెసిడెంట్ రాధా కృష్ణ..

బీసీ కమిషన్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభప్రద్ పటేల్ ను సన్మానించిన BCJAC హైదరాబాద్ ప్రెసిడెంట్ రాధా కృష్ణ..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఖైరతాబాద్ బీసీ కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ మెంబర్ గా శుభప్రద్ పటేల్ పదవీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. ఈ నేపథ్యంలో BCJAC హైదరాబాద్ ప్రెసిడెంట్ తాటి రాధా కృష్ణ ఖైరతాబాద్ బీసీ కమిషన్ కార్యాలయంలో శుభ ప్రద్ పటేల్ ను సన్మానించారు. ఈ సందర్బంగా BCJAC హైదరాబాద్ ప్రెసిడెంట్ తాటి రాధా కృష్ణ ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ శుభ ప్రద్ పటేల్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మలిదశ ఉద్యమ సమయంలో క్రియాశీల పాత్ర పోషించారని, విద్యార్థులను చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమం వైపు నడిపించారని రాధాకృష్ణ పేర్కొన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారని రాధా కృష్ణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో శుభప్రద్ పటేల్ పై ఎన్నో అక్రమ కేసులు నమోదుచేశారని కానీ శుభప్రద్ పటేల్ ఎక్కడ దేనికి భయపడకుండా ప్రత్యేక రాష్ట్ర సాధనే ద్యేయంగా ముందుకుసాగరని రాధా కృష్ణ గుర్తుచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు మొట్ట మొదటిగా గుర్తొచ్చేది ఉద్యమకారుడు శుభప్రద్ పటేల్ అని రాధా కృష్ణ అన్నారు. శుభప్రద్ పటేల్ తో పాటు మలిదశ ఉద్యమంలో సహా ఉద్యమకారునిగా పోరాటాలు చేయడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు రాధా కృష్ణ తెలిపారు. లాఠీలకు తూటాలకు ఎదురు నిలబడిన ఉద్యమ విరుడుకి ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కడం పట్ల రాధా కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. శుభప్రద్ పటేల్ మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని BCJAC హైదరాబాద్ ప్రెసిడెంట్ తాటి రాధా కృష్ణ ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *