రాత్రి కర్య్పూ మంచిదే.. పగటిపూట బాధ్యత మనపైనే: బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి

రాత్రి కర్య్పూ మంచిదే.. పగటిపూట బాధ్యత మనపైనే: బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్య్పూ అమలు చేసిందని పగటిపూట బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కరోనా ఉదృతి ఎక్కువ అయిందని జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కరోనా నియంత్రణకు సంబంధించి ప్రభుత్వంపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని ఒక్కసారి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టమవుతుందని జనార్దన్ రెడ్డి అన్నారు.

ప్రజలను ఉద్దేశించి బి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కరొనను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు కూడా తమ ప్రాణాలను తామే కాపాడుకోవాల్సిన సందర్భం ఇది అని జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రజలు ముఖ్యమైన పనులు ఉంటె తప్ప బయటకు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్లిన కూడా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ భహిరంగ ప్రదేశాల్లో తిరగాలని రాష్ట్ర ప్రజలకు జనార్దన్ రెడ్డి సూచించారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని జనార్దన్ రెడ్డి ఈమేరకు తెలిపారు. స్వీయ నియంత్రణ వల్లే కరోనాను కట్టడి చేయవచ్చని అయన   తెలిపారు. కోవిద్ వాక్సిన్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుందని అన్నారు. విడతల వారీగా ఇచ్చిన వాక్సిన్ ఇప్పుడు 18 ఏళ్ళు పై బడిన దేశ ప్రజలందరికి మే 1 నుండి ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని అయన తెలిపారు. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు వాక్సిన్ వేయించుకోవాలని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published.