వరవరరావును వెంటనే విడుదల చేయాలి..
యాదాద్రి,భువనగిరి: విరసం నేత వరవరరావును గత ఇరవై నెలలుగా భీమా కోర్ గావ్ కేసులో విచారణ ఖైదీగా ముంబై తలొజా జైయిలో ఉంచారు. గత కొద్ది రోజులనుండి వరవరరావు ఆరోగ్యం విషమించడంతో ముంబాయిలోని జేజే ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయనకు కారోన పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. వరవరరావు కు కారోన సోకిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అటు నాయకులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. కారోన సోకిన వరవరరావు గారికి మెరుగైన వైద్యం అందిచి వెంటనే బెయిల్ పై విడుదల చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహ రెడ్డి డిమాండ్ చేశారు. వరవరరావు గారి ప్రాణాలకు హాని జరిగితే కేంద్ర ,మహారాష్ట్ర ప్రభుత్వాలు దానికి పూర్తి బాధ్యత వహించాలని కొమ్మిడి నర్సింహారెడ్డి మీడియాతో పేర్కొన్నారు.
వరవరరావును వెంటనే విడుదల చేయాలి..
