బోనాల వేడుకలో పాల్గొన్న పద్మారావు గౌడ్

బోనాల వేడుకలో పాల్గొన్న పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా మహమ్మారి తో పాటు అన్ని రుగ్మతలు దూరం కావాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ లోని చారిత్రాత్మక చిలకల గూడా కట్ట మైసమ్మ దేవాలయం లో బోనాలు వేడుకల్లో తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆదివారం పాల్గొని ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించారు. సకుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తీగుళ్ల పద్మారావు గౌడ్, శ్రీమతి తీగుళ్ల స్వరూప పద్మారావు గౌడ్ దంపతులకు ఆలయం అధికారులు శాస్త్రోక్తంగా స్వగతం పలికారు. ఈ సందర్బంగా తీగుళ్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ బోనాలు వేడుకలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక మన సంస్కృతిని పరిరక్షించుకోవడంలో ప్రభుత్వం శ్రమిస్తోందని అన్నారు. ప్రజలకు బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. అందరి సుఖ సంతోషాలకు ప్రార్ధించాను , ఎవరూ కరోనా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు పడాలని అయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published.