డ్రగ్స్ కేసులో హీరో రవితేజ.. మీడియాను చూసి పరుగులు..
ఆర్.బి.ఎం హైదరాబాద్: డగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హీరో రవితేజ నేడు హాజరయ్యారు. రవితేజతో పాటు ఆయన కారు డ్రైవర్ శ్రీనివాస్ కూడా హాజరయ్యాడు. రవితేజ తన ఫాంహౌస్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ కార్యాలయం ముందున్న మీడియాను చూసి రవితేజ పరుగులు తీశారు. ఈ కేసుపై ఈడీ విచారణ చేస్తున్నప్పటి నుంచి రవితేజ మీడియాకు చిక్కకుండా జాగ్రత్తలు పడుతున్నారు. రవితేజపై ప్రశ్నలను సంధించేందుకు ఈడీ సర్వం సిద్ధం చేసుకుంది. రవితేజకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతోపాటు.. అనుమానాస్పద లావిదేవీలపై కూడా ఈడీ దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.
ఈ కేసులో సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మికౌర్, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానాను ఈడీ విచారించింది. నవదీ్‌పతో పాటు ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్ 13న, ముమైత్‌ఖాన్ 15న, తనీష్ 17న, తరుణ్ 22న విచారణకు హాజరుకానున్నారు.
