హీరోయిన్ అనన్య నాగళ్ళ విడుదల చేసిన “ఏవమ్ జగత్” చిత్రంలోని రాధాస్ లవ్ సాంగ్ !

హీరోయిన్ అనన్య నాగళ్ళ విడుదల చేసిన “ఏవమ్ జగత్” చిత్రంలోని రాధాస్ లవ్ సాంగ్ !

ఆర్.బి.ఎం డెస్క్: కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో దినేష్ నర్రా దర్శకత్వంలో మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్న చిత్రం ”ఏవం జగత్”. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలోని రాధాస్ లవ్ సాంగ్ ని పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఫేమ్ అనన్య నాగళ్ళ విడుదల చేసారు.

” ఉదయించే సూర్యిడిలా ..
ప్రతిరోజు నిను చూసా ..
జనియించిందే ..
ఒక స్వప్నం.. !!”

అనే పల్లవితో సాగిన మంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ఇది. శివ కుమార్ మ్యూజిక్ అందించగా సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ ఆలపించిన సాంగ్ ఇది. పాటను విడుదలచేసిన సందర్బంగా అనన్య నాగళ్ళ చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు .

ప్రపంచీకరణ నేపధ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. దీని వల్ల నిజంగా మన దేశం అభివృద్ధి చెందిందా..? మన కలాం గారి కల, మిషన్ 2020 నెరవేరిందా..? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న సినిమా “ఏవమ్ జగత్”. ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ…వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? అనే అంశాలను ప్రధానంగా ‘ఏవం జగత్’ మూవీలో చూపిస్తున్నాం. వ్యవసాయం మరియు మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక 20 ఏళ్ల యువకుడి కథే ‘ఏవం జగత్’. ఒక పల్లెటూరిలో సాగే ఈ కథలో, దేశ పరిస్థితులను, పురోగతికి అద్దం పట్టేలా కథా కథనాలు సాగుతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో కమల్ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు.

నటీనటులు – కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు

ఈ చిత్రానికి సంగీతం – శివ కుమార్,
సినిమాటోగ్రఫీ – వెంకీ అల్ల,
ఎడిటింగ్ – నిశాంత్ చిటుమోతు,
ఆర్ట్ – సదా వంశి,
ప్రొడక్షన్ మేనేజర్ – అభినవ్ అవునూరి,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ – మోహన్ కృష్ణ,
క్వాలిటీ హెడ్ : సిద్దార్థ కండల
సంపూర్ణమ్మ, స్కంద ఆముదాల,
నిర్మాతలు – ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్,
రచన దర్శకత్వం – దినేష్ నర్రా
పిఆర్ ఓ : సాయి సతీష్, పర్వతనేని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *