వాళ్ళకు సహయం చేయలేకపోతున్నా క్షమించండి: సోనూ సూద్

వాళ్ళకు సహయం చేయలేకపోతున్నా క్షమించండి: సోనూ సూద్

లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నారు సోనూ సూద్. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చిన తను స్పందించి వారికి కావాల్సిన సహయం సోనూ సూద్ అందిస్తున్నాడు. సోషల్ మీడియా వేధికగా ఎంతో మంది తమ సమస్యలను సోనూ సూద్ కు చేరవేస్తున్నారు. ఆ వచ్చే మెసేజ్ లకు సానుకూలంగా స్పందించి వారికి వీలైనంత సహయం చేస్తున్నాడు.

ఆయితే తాజాగా సోనూ సూద్ తన ట్విటర్ లో ఒ పోస్ట్ చేశాడు. తన సోషల్ మీడియా ఖాతాలకు వేల సంఖ్యలో మెసేజ్ లు వస్తున్నాయని ట్విటర్ లో పేర్కోన్నారు. పేస్ బూక్ కి వచ్చిన మెసేజ్ లు 19000. మెయిల్కి వచ్చిన మెసేజ్ లు 1137. ఇన్ ష్టా మెసేజ్ లు 4812. ట్విటర్ మెసేజ్ లు 6741 అని సోనూ సూద్ ట్విటర్ లో వెల్లడించారు.

వేల మెసేజ్ లు రావడంతో వాటిలో కొన్ని మెసేజ్ లు మాత్రమే తను చూడగలుగుతున్నానని మిగితవి చూడలేకపోతున్నానని అయన వివరించారు. తనకు సాధ్యమైనంత మందికి సహయం చేస్తానని ఆయన తెలిపారు. కొన్ని మెసేజ్ లు చూడలేకపోయాను వాళ్లు నన్ను క్షేమించాలని సోనూ సూద్ ట్విటర్ లో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.