నా ఆశలన్నీ శిథిలమైయ్యాయి: సమంత
ఆర్.బి.ఎం హైదరాబాద్: నటి సమంత మరోసారి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఎంతో కష్టపడి తన కెరీర్‌ను నిర్మించుకున్నానని తెలిపారు. అయితే ఈ ఏడాది తన పర్సనల్ లైఫ్‌కి గట్టి ఎదురుదెబ్బ తలిగిందని చెప్పారు. తన ఆశలన్నీ శిథిలమైయ్యాయని, ఎంతో కుంగుబాటుకు లోనయ్యానని వాపోయారు. కాలం తన కోసం ఏది రాసిపెడితే దాన్ని ధైర్యంగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. తనపై కొందరు అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని తప్పుబట్టారు. అసభ్య కామెంట్స్ చేసేవారిని ఒక్కటే కోరుతున్నా.. తన అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఒక విధానం ఉంటుందన్నారు. తనపై ఇష్టానుసారంగా అసభ్యంగా పోస్టులు పెట్టడం సరికాదని సమంత తప్పుబట్టారు.