భగవద్గీతకు మరింత చేరువయ్యే సందర్భం శ్రీకృష్ణ జన్మాష్టమి

భగవద్గీతకు మరింత చేరువయ్యే సందర్భం శ్రీకృష్ణ జన్మాష్టమి

“ఓ అర్జునా, నీవు ఒక యోగివి కమ్ము, కురుక్షేత్ర యుద్ధరంగంలో పలికిన ఈ అమర వాక్కులతో కృష్ణ భగవానుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడిని అంతిమ మోక్షం కోసం యోగ మార్గాన్ని అవలంబించమని బోధించాడు. ఒక దైవిక గ్రంథమైన భగవద్గీత జీవిత లక్ష్యాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తూ మానవాళి అంతా హృదయపూర్వకంగా తప్పక అన్వేషించవలసిన అంతిమ సత్యాల గురించి వివరిస్తుంది. కొంతవరకూ నివ్వెరపోయి, భయాందోళనలకు గురైన తన శిష్యుడిని… ధర్మానికి అన్నిటికన్నా ప్రాముఖ్యత నివ్వమని, మోహంతో కర్మఫలాలకు బంధీ కావొద్దని స్వయంగా భగవానుడే ఇచ్చిన త్రికాలాలకు అతీతమైన ప్రవచనం ఈ పవిత్ర గ్రంథంలో ఉన్నది.

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆధ్యాత్మిక కళాఖండమైన ‘ఒక యోగి ఆత్మకథ’ ను రచించిన శ్రీ శ్రీ పరమహంస యోగానంద, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన అమర సందేశపు వాస్తవమైన అర్థం గురించి “భగవానుడు-అర్జునుల సంవాదం” అనే పేరుతో ఆయన రచించిన గీతా వ్యాఖ్యానంలో చాలా వివరంగా తెలియజేశారు. మహాభారతంగా ప్రాచుర్యంలో ఉన్న కురుక్షేత్ర యుద్ధం యొక్క యధార్థమైన ప్రాముఖ్యత ప్రతి మానవుడి మనస్సులో నిరంతరమూ జరుగుతున్న ఆంతరిక యుద్ధాలలోనే ఇమిడి ఉందని యోగానందగారు వివరించారు. మానవ జీవితంలోని ప్రతి అంకంలోనూ మనలోని మంచి సంస్కారాలు, చెడు సంస్కారాలతో విధిగా యుద్ధం చేయవలసిందే; అంతిమంగా మంచిచెడులను జయించి తీరవలసిందే, కాని భగవంతుడికి చేరువవడానికి మనం దృఢంగా కృషి చేసి, దాని ఫలితంగా లౌకిక ప్రపంచంతో ఉన్న బంధాలపై వ్యామోహాన్ని త్యజించడానికి ముందు మాత్రం కాదు.

బాలకృష్ణుడు తన తల్లి దేవకికి జన్మించిన వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం జన్మాష్టమిగా పండుగ జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సంగీతంతో నిండిన అందమైన ఉత్సవాలు తరచుగా రాత్రంతా జరుపుకుంటారు. విష్ణుదేవుని అవతారమైన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినం వేడుకలు జరుపుకోవడం కోసం భక్తులు అందరూ అందంగా అలంకరించబడిన దేవాలయాలలో కలుస్తారు. స్వయంగా తమ ఇళ్ళలోని చిన్న చిన్న మందిరాలను కూడా అలంకరిస్తారు. కాని మహాత్ములు మనకి చెప్పినట్టు జన్మాష్టమి ఉత్సవాన్ని వాస్తవంగా జరుపుకోవడమంటే, అలా జరుపుకోవాలి కూడా. మనం కృష్ణ భగవానునితో మరింతగా అనుసంధానంలో ఉండడం కోసం కృషి చేస్తూ మన హృదయాలలో, ఆత్మలలో జరుపుకోవడం.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను శ్రీ శ్రీ పరమహంస యోగానంద 1917లో స్థాపించారు. అది కలకాలం నిలిచే క్రియాయోగ ధ్యాన పద్ధతిని అనేక విధాలుగా వ్యాప్తి చేయడమనే బాధ్యతను తీసుకుంది. అమర గురువులైన మహావతార్ బాబాజీ క్రియాయోగ సంప్రదాయాన్ని గొప్ప యోగావతారులైన లాహిరీ మహాశయులకు ప్రదానం చేశారు, ఆయన తిరిగి ఆ శాస్త్రాన్ని యోగానందగారి యొక్క ఆధ్యాత్మిక గురువైన జ్ఞానావతారులు స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి గారికి బోధించారు.

కృష్ణ భగవానుడు, భగవద్గీతలోని శ్లోకాలలో రెండుసార్లు క్రియాయోగం గురించి ప్రస్తావించారు. అది మానవులకు తెలిసిన అత్యున్నత శాస్త్రము. అది ఆధ్యాత్మిక సాధకుడిని భగవంతుడితో ఏకత్వమనే తన లక్ష్యం వైపు ప్రోత్సహిస్తుంది.

ఈ మహత్తరమైన జన్మాష్టమి దినాన మన చుట్టూ ఉన్న వారందరి శ్రేయస్సు కోసం మనమందరం మనలోని కృష్ణుడిని మేల్కొల్పి ఆయన బోధలతో అనుసంధానంలో ఉండడానికి ప్రయత్నిద్దాం.

మరిన్ని వివరాలకు yssi.org వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి. నేరుగా మాట్లాడేందుకు రాంచీ హెల్ప్ డెస్క్ నెంబర్ 06516655555కు కాల్ చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *