సూపర్‌స్టార్ కృష్ణకు గుండెపోటు.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉంది: వైద్యులు

హైదరాబాద్: సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. నిన్న రాత్రి కృష్ణకు గుండెపోటు రావడంతో నానక్‌రాంగూడలోని కాంటినెంటర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ఆయన స్పృహలో లేరు. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ఆయన గుండెపోటు నుంచి బయటపడేలా వైద్యలు ప్రయత్నించారు. ప్రస్తుతం కాస్త నిలకడగానే ఉన్నా ఆందోళనకర పరిస్థితిగానే చెప్పక తప్పదని వైద్యులు పేర్కొన్నారు. 24 గంటల తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కృష్ణ గుండెపోటుకు గురయిన విషయం తెలియడంతో ఘట్టమనేని అభిమానులు ఆందోళన చెందారు. ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. కృష్ణ కోలుకుని క్షేమంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.