బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్ల ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి…

బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్ల ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి…

ఆర్.బి.ఎం: తెలంగాణ సంస్కృతి, సప్రాదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ చీరల పంపిణీ చేపట్టినట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 55,65 మరియు 66 వ డివిజన్లకు చెందిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా మహిళలకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను, ఆసరా పెన్షన్ల ను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అరూరి రమేష్ పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా జరుపుకోవడం మన అందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు గొప్పగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగను మహిళలు ఆత్మగౌరవంతో జరుపుకునేలా వారికి ఉచితంగా చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం లో ఈరోజు ఆసరా పింఛన్లు 64 సంవత్సరాలకు రావలిసిన పింఛన్లను 57 సంవత్సరాలకె మంజూరు చేసి 2016/-రూపాయల పింఛన్లు, ఇవ్వడం, మరియు వికలాంగులకు 3016/-పింఛన్లు ను ఇచ్చే ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందనీ,ఈరోజు పేద ఇంట్లో ఒక శుభాకార్యం జరిగిన,పెళ్లి చేసుకునే వారికి కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ క్రింద 1,00,116/- రూపాయలు, ఇవ్వడం జరుగుతుంది.కులము లేదు మతము లేదు అందరికీ ఇవ్వడం జరుగుతుందనీ ఆయన అన్నారు .

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.