47 బుల్లెట్లు దిగినా ప్రజల కోసం బతికాను: కొండా మురళి

47 బుల్లెట్లు దిగినా ప్రజల కోసం బతికాను: కొండా మురళి

ఆర్.బి.ఎం వరంగల్: మాజీమంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతుల జీవిత ఆధారం ‘కొండా’ మూవీని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. కొండా దంపతుల జీవితంలో వారు ఎదుర్కొన్న ఘటనల ఆధారంగా సినిమాను తీస్తున్నారు. హన్మకొండలో కొండా కార్యాలయంలో ‘కొండా’మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎదురైన ఘటనలను గుర్తుచేశారు. జనవరి 26న తనపై 47 బుల్లెట్లు ఫైరింగ్‌ చేశారని, అయినా తాను బతికానని తెలిపారు. తాను బతికింది తన కుటుంబం కోసం కాదని, ప్రజల కోసమే బతికానని మురళి పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మకు రెండు తన జీవితం గురించి రెండు ముక్కలు చెప్పానని, అయితే వర్మ వంద మందిని విచారించి.. పూర్తిగా విషయాలు తెలుసుకుని సినిమా తీశారని మురళి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *