విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్‌ స్థాయికి ఎదిగిన రోశయ్య: వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ సందీప్ రెడ్డి

విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్‌ స్థాయికి ఎదిగిన రోశయ్య: వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ సందీప్ రెడ్డి

ఆర్.బి.ఎం రాజేంద్రనగర్: బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ సందీప్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చిత్రపటానికి ఏనుగుల సందీప్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. చిత్రపటం వద్ద కొద్దిసేపు మౌనం పాటించి వారి పవిత్ర ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఏనుగుల సందీప్ రెడ్డి ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ రోశయ్య సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారన్నారు.ఉమ్మడి ఏపీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా, శాసన సభ్యుడిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని అన్నారు. పరిపాలనాదక్షుడిగా, అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక నిపుణుడిగా, రోశయ్య పేరుప్రఖ్యాతలు గడించారని ఆయన గుర్తు చేశారు.

విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్‌ స్థాయికి ఎదిగారని కొనియాడారు. అప్పగించిన ఏ బాధ్యత అయినా సమర్థంగా నిర్వహించేవారన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా, రోశయ్య ఆర్థిక మంత్రిగా వారి కాంబినేషన్ చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లుగా వుండేదన్నారు.

ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేతగా, విలువలు, సంప్రదాయాలు కాపాడటంలోనూ, వివాదరహితులుగా, నిష్కళంకితులుగా మన్ననలు పొందారన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన నిర్వర్తించిన పాత్ర వర్ణనాతీతమన్నారు. ఆయన మృతితో ఓ రాజకీయ ధృవతార రాలిపోయిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ సందీప్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *