గణపతి షుగర్ ఫ్యాక్టరీ మూసివేస్తే ఊరుకోం: మాణిక్యం, ఉమ్మడి మెదక్ జిల్లా డి సి సి బి వైస్ చైర్మన్

గణపతి షుగర్ ఫ్యాక్టరీ మూసివేస్తే ఊరుకోం: మాణిక్యం, ఉమ్మడి మెదక్ జిల్లా డి సి సి బి వైస్ చైర్మన్

ఆర్.బి.ఎం సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలోని పసల్ వాది లో ఉన్న గణపతి షుగర్ ఫ్యాక్టరీని మూసేస్తాం అంటే చూస్తు ఊరుకోమని ఉమ్మడి మెదక్ జిల్లా డి సి సి బి వైస్ చైర్మన్ మాణిక్యం మండిపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే పసల్ వాది లో ఉన్న గణపతి షుగర్ ఫ్యాక్టరీని యాజమాన్యం మూసివేస్తాం అనడంతో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఫ్యాక్టరీ మూసివేయొద్దు అంటు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల ధర్నాకు ఉమ్మడి మెదక్ జిల్లా డి సి సి బి వైస్ చైర్మన్ మాణిక్యం సంఘీభావం తెలిపారు. కార్మికులకు మద్దతుగా పోరాడుతానని ఆయన అన్నారు. షుగర్ ఫ్యాక్టరీని అర్దాంతరంగా మూసి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని మాణిక్యం సూచించారు. ఉన్నఫల్లంగా ఫ్యాక్టరీ మూసేస్తే ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని బతుకుతున్న వారి పరిస్థితి ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఈ నేపద్యంలో ప్రభుత్వం కార్మికులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *