వికారాబాద్ లో స్కూల్ బస్సు దగ్ధం..

వికారాబాద్ లో స్కూల్ బస్సు దగ్ధం..

ఆర్.బి.ఎం వికారాబాద్: మంగళవారం తెల్లవారుజామున వికారాబాద్ కేంద్రంలో ఆగి ఉన్న స్కూల్ బస్సు అగ్నికి ఆహుతైంది.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ కేంద్రంలో ఉన్న న్యూ గీతాంజలి స్కూల్ కు చెందిన ఈ బస్సు ఎప్పటిలాగే స్కూల్ సమీపంలో పార్క్ చేశారు. కాగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పార్క్ చేసిన ప్రదేశంలోనే బస్సులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఓ దశలో ఉలిక్కిపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కొద్ది క్షణాల్లోనే ఘటన స్థలానికి పోలీసులు ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. బస్సు పార్క్ చేసిన ప్రదేశంలోనే ఎలా దగ్దమైందో అన్న కోణంలో పోలీసులు తెలుసుకునే పనిలో వున్నట్లుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.