అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యత : ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్

అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యత : ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం సికింద్రాబాద్: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు చెందిన పండుగలకు సమాన ప్రాముఖ్యతను కల్పిస్తోందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమాన్ని శనివారం సితాఫలమండీ లో తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భాంగా మాట్లాడుతూ తెలంగాణా సంస్కృతిని పరిరక్షించడంలో తాము పాటుపడతామని పద్మారావు గౌడ్ అన్నారు. దసరా పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అయన ఆకాంక్షించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దాదాపు 60 వేల మందికి బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని, 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి మహిళకు రేషన్ కార్దు తో చీరను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీతా, శ్రీమతి కంది శైలజ, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ పల్లె మోహన్ రెడ్డి, తెరాస కార్మిక విభాగం నేత మోతె శోభన్ రెడ్డి, తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, నేతలు కంది నారాయణ, లింగాని శ్రీనివాస్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *