రేవంత్‌‌పై కేటీఆర్‌ పరువు నష్టం దావా… సెక్షన్ ఆఫీస్‌లోనే ఆగిన పిటిషన్‌

revanthreddy

రేవంత్‌‌పై కేటీఆర్‌ పరువు నష్టం దావా… సెక్షన్ ఆఫీస్‌లోనే ఆగిన పిటిషన్‌
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై సిటీ సివిల్‌ కోర్టులో మంత్రి కేటీఆర్ దాఖలు చేయాలనుకున్న పిటిషన్ సరైన ఆధారాలు లేక కోర్టు బెంచ్‌ మీదకు వెళ్లలేదు. పరువు నష్టం దావాకు సంబంధించిన సరైన పత్రాలు సమర్పించలేదు. దీంతో ఈ పిటిషన్ సెక్షన్ ఆఫీస్‌లోనే ఆగింది. మంగళవారం పూర్తి ఆధారాలతో సమర్పిస్తామని కోర్టుకు కేటీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని కేటీఆర్ తరపు న్యాయవాదులు ఆయన దృష్టి తెచ్చారు. రేపు పూర్తి ఆధారాలతో సమర్పిస్తామని కేటీఆర్ ప్రకటించారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా తన పేరును వాడుతున్నారని కేటీఆర్‌ పిటిషన్‌‌‌లో పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల కలిగిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని సైతం ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. తనపై రేవంత్ చేస్తున్న అసత్య ప్రచారాలను గుర్తించి ఇలాంటి దురుద్దేశ కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను తగిన విధంగా శిక్షిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *