బస్తి కమిటీలు,పోలింగ్ బూత్ కమిటీల సమావేశంలో పాల్గొన్న కిరణ్ కుమార్ గౌడ్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ గారి ఆదేశాల మేరకు బౌధనగర్ డివిజన్జ పరిధిలోని అన్ని బస్తి కమిటీలు, పోలింగ్ బూత్ కమిటీ ఎన్నికల సమావేశం గురువారం బౌధనగర్ కమ్యూనిటీ హాల్లో కోలాహలంగా జరిగింది. తెరాస యువ నేత, బౌధనగర్ ఇంచార్జ్ తీగుల్ల కిరణ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ సమావేశానికి బౌధనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ, పార్టీ సమన్వయ కర్తలు జలంధర్ రెడ్డి, శ్రీ రాజ సుందర్ లతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బౌధనగర్ ప్రాంతం చిరకాలంగా తెలంగాణ వాదానికి, తెరాస పార్టీ కి కంచు కోటగా నిలిచిందని, కెసిఆర్ నాయకత్వంలో, పార్టీ ద్వారా వివిధ అభివృద్ది కార్యక్రమాలను చెప్పడతామని తీగుల్ల కిరణ్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
