9 ఏళ్లకే ముగిసిన శిఖర్ ధవన్, ఆయేషా దంపతుల ప్రేమ పెళ్లి.. తీవ్ర ఆవేదనకు గురైన ఆయేషా ..
ఆర్.బి.ఎం, ఢిల్లీ: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్, ఆయేషా దంపతులు విడిపోయారు. వీరిద్దరికి 2012లో వివాహం అయింది. ఈ ఇద్దరూ తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పారు. ఈ దంపతులకు 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే అయేషా, ధవన్ కంటే 11 ఏళ్లు పెద్దది. ప్రస్తుతం ధవన్‌కు 35 ఏళ్లు, ఆయేషాకు 46 ఏళ్లు. వీరిద్దకి సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు. ధవన్‌ను ఆయేషా రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె మొదటి భర్తతో ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చింది. ఆయేషా మొదటి భర్త పిల్లలు అలియా, రియాను ధవన్ దత్తత తీసుకున్నాడు. అయితే గత ఏడాది నుంచి ధవన్, ఆయేషాల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్లు తెలుస్తోంది. జీవితంలో రెండోసారి తాను విడాకులు తీసుకోవాల్సి రావడంపై ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయేషా తన ఆవేదనను వ్యక్తం చేశారు. తొలిసారి విడాకులు తీసుకుంటున్నప్పుడు తాను చాలా భయపడ్డానని, జీవితంలో ఓడిపోయినట్టు, తప్పు చేస్తున్న భావన తనను పట్టి పీడించేవని పేర్కొంది.
