మరో ఉద్యమానికి షర్మిల శ్రీకారం

మరో ఉద్యమానికి షర్మిల శ్రీకారం

ఆర్.బి.ఎం డెస్క్  హైదరాబాద్: సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 12 తుంగతుర్తి నియోజక వర్గం తిరుమలగిరిలో దళిత భేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తునట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులను సభకు పెద్ద ఎత్తున తరలించేందుకు వైఎస్‌ఆర్‌టీపీ వ్యూహాలు రచిస్తోంది. దళితులను కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని పార్టీ అధికార ప్రతినిధి ఏపురీ సోమన్న విమర్శించారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై తిరుమలగిరి సభ వేదికగా ఎండగడుతామని సోమన్న తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ‘దళిత గిరిజన దండోరా’ పేరుతో సభలు సమావేశాలు నిర్వహిస్తోంది. ఇక అధికార పార్టీ టీఆర్‌ఎస్ దళిత బంధు పేరుతో దళితులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోన షర్మిల కూడా దళితులతో మమేకం అయ్యేందుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. షర్మిల ఇప్పటికే పోడు భరోసా యాత్రలను చేస్తున్నారు. ఆదివాసులకు అండ నిలుస్తున్నారు. ఆదివాసులపై పారెస్టు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *