వ్యవసాయ భూముల్లో పర్యటించిన క్యాసరం సర్పంచ్ పెంటయ్య..

వ్యవసాయ భూముల్లోపర్యటించిన క్యాసరం సర్పంచ్ పెంటయ్య..

ఆర్.బి.ఎం డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వాల్ల రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని క్యాసారం గ్రామా సర్పంచ్ పెంటయ్య పేర్కొన్నారు. క్యాసారం గ్రామంలోని పలు వ్యవసాయ భూముల్లో సర్పంచ్ పెంటయ్య పర్యటించారు. పంట పొలాల్లో పని చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల నేపథ్యంలో సర్పంచ్ పెంటయ్య రైతులతో చర్చించారు. ఈ క్రమంలో సర్పంచ్ పెంటయ్య తెరాస ప్రభుత్వంపై మంటలు చెరిగారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదని పెంటయ్య అన్నారు. రైతులకు పెద్ద పీఠ వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరోసారి సర్పంచ్ పెంటయ్య గుర్తుచేశారు.వచ్చే ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాని ఏర్పాటు చేస్తుందని పెంటయ్య అన్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత మొదలైందని వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని పెంటయ్య ఘాటుగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *