కరోనా కట్టడి చర్యలు ముమ్మరం.. :పద్మారావు గౌడ్

కరోనా కట్టడి చర్యలు ముమ్మరం.. :పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా కోవిడ్ నిబంధలను ప్రతి ఒక్కరు పాటించేలా అధికారులు కృషి చేయాలని, సికింద్రాబాద్ పరిధిలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ పరిధిలో కరోనా నివారణ చర్యలను అధికారులతో శుక్రవారం సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. సికింద్రాబాద్ పరిధిలోని కుట్టి వెల్లోడి, తుకారం గేటు, అడ్డగుట్ట, చిలకలగుడా, లాలాపేట. రెడ్ క్రాస్, మేట్టుగుడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ టెస్టింగ్ నిర్వహణలను శ్రీ పద్మారావు గౌడ్ సమీక్షించారు. జి.ఎచ్.ఎం.సి ఉప కమీషనర్ మోహన్ రెడ్డి, తాసిల్దార్ శ్రీ సునీల్ కుమార్, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *