గోపాల్‌పేటలో సీఎం కప్ క్రీడా సంబరాలు

గోపాల్‌పేటలో సీఎం కప్ క్రీడా సంబరాలు

♦ ప్రారంభించిన శివసేన రెడ్డి, చిన్నా రెడ్డి

 

ఆర్.బి.ఎం:వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సెకండ్ ఎడిషన్ సీఎం కప్ (2025-26) వనపర్తి నియోజకవర్గ స్థాయి క్రీడోత్సవాలు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా సంబరాలకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరియు డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి , రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు క్రీడా జ్యోతిని వెలిగించి, క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకే ప్రభుత్వం సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ స్థాయి పోటీల్లో వివిధ మండలాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, గెలుపోటములను సమానంగా తీసుకుంటూ క్రీడా స్ఫూర్తిని చాటాలని అతిథులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *