ఫుట్ బాల్ టాలెంట్ ఫూల్ అపూర్వ స్పందన

ఫుట్ బాల్ టాలెంట్ ఫూల్ అపూర్వ స్పందన

 

తెలంగాణలో ఫుట్‌బాల్ సంస్కృతిని పునరుద్ధరించడానికి
హైదరాబాదు నగరము లో ఫుట్ బాల్ క్రీడకు పునర్ వైభవం తీసుకువచ్చే చర్యల్లో భాగంగా
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
తెలంగాణ ఫుట్ బాల్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ మరియు “ఫిఫా”
లతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఫుట్ బాల్ టాలెంట్ పూల్ కు అపూర్వ స్పందన లభిస్తోంది.

దివి 3 -5 -2025 శనివారం నాడు గచ్చిబౌలి జిఎంసిబి స్టేడియంలో జరిగిన అండర్ 15 బాలుర టాలెంట్ హంట్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి దాదాపు600మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 11 మంది క్రీడాకారుల చొప్పున , 30 జట్లుగా విభజించి పోటీలు నిర్వహించి వారిలో వారు ప్రదర్శించిన వివిధ ఫుట్ బాల్ టెక్నిక్స్ రికార్డు చేశారు.

రేపు కూడా అండర్ 15 బాలుర కోసం ఈ టాలెంట్ పూల్ కార్యక్రమం కొనసాగనుంది.అదేవిధంగా బాలికల కోసం మే 5,6 తేదీల్లో 15 ఏళ్లలోపు ఫుట్‌బాల్ క్రీడాకారుల ప్రతిభను గుర్తించే “టాలెంట్ పూల్” ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలోని భాగంగా 05.05.2025 సోమవారం నాడు గచ్చిబౌలి స్టేడియంలో ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తోంది. కోచ్‌లు, ఫిజికల్ డైరెక్టర్లు, సాంకేతిక అధికారుల కోసం’ ప్రతిభ గుర్తింపు మరియు ప్రోత్సాహం’పై ఈ వర్క్‌షాప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published.