పురుషుడి వీర్యంలో ఉంటే శుక్ర కణాలు ఈదగలవా..? ఈదుకుంటూ వచ్చి స్త్రీ అండంలో కలుస్తాయా..?

వీర్యము ఇది జీవుల పుట్టుకకు కారణం. మానవులలో ఇది పురుషాంగము నుండి స్రవించబడుతుంది. రతి కార్యంలో వీర్యకణాలు స్త్రీ అండాశయంలో ప్రవేశించి ఫలదీకరణం చెంది పిండము ఏర్పడుతుంది. పురుషులలో కౌమార దశ నుండి వీర్యోత్పత్తి ప్రారంభమౌతుంది. వృషణాలు వీర్యం అభివృద్ధికి తోడ్పడుతాయి. అయితే మానవ శరీరంలో ఫలదీకరణ ప్రక్రియ గురించి మనందరం ఎన్నో విషయాలు చదువుకున్నాం. కొన్ని కల్పిత కథలు, కొన్ని శాస్త్ర విషయాలు నేర్చుకున్నాం. పురుషుడి శరీరం నుంచి విడుదలైన వేల కొలది వీర్య కణాలు వేగంగా ఈదుకుంటూ స్త్రీ అండాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ప్రయాణిస్తాయని, అది చేరుకునే వరకు అండం ఓపికగా వేచి చూస్తుందన్న కథ ప్రచారం ఉంది. వీర్యం చురుకైన పాత్ర పోషిస్తుందని, అండం మందకొడిగా ఉంటుందన్నది మన అవగాహన. అయితే, అది నిజం కాదని కొట్టిపారేస్తున్నారు నిపుణులు. వాస్తవంలో సంతానోత్పత్తి ప్రక్రియ అలా జరగదు. పునరుత్పత్తి ప్రక్రియలో వీర్యం, అండం రెండూ ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయని చెబుతున్నారు. స్ఖలనం కాగానే కోట్ల వీర్య కణాలు స్త్రీ యోనిలోకి ప్రవేశిస్తాయి. ఒక సగటు స్ఖలనంలో సుమారు 25 కోట్ల వీర్య కణాలు ఉంటాయని అంటున్నారు. అక్కడి నుంచి వీర్యం నేరుగా అండం వైపుకి పరిగెడుతుందని అందరి అపోహా. అయితే అలా జరగదని, దానికి చాలా చెక్ పోస్టులు ఉంటాయని అవన్నీ దాటుకుని వెళ్లాలని అంటున్నారు నిపుణులు.

స్త్రీ కోణం నుంచి చూస్తే పునరుత్పత్తి మార్గంలో అనేక ‘చెక్ పాయింట్లు’ ఉంటాయని, వీర్యం వాటన్నిటినీ దాటుకుని ఫలదీకరణం జరిగే ప్రదేశానికి వెళ్లాలని, అది ప్రవేశ స్థానానికి చాలా దూరంలో ఉంటుందని వైద్యులు అంటున్నారు. వీర్య కణాలలో లోపాలేమీ లేకపోతే ఈ అడ్డంకి దాటడం సులువే. అయితే చాలా వీర్య కణాలలో డీఎన్ఏ డ్యామేజ్ లేదా ఇతర లోపాలు ఉంటాయని చెబుతున్నారు. వీర్య కణాలు వాటంతట అవే అండ వాహికల చివరలకు చేరుకోలేవని, వాటికి అంత బలం ఉండదని వెల్లడిస్తున్నారు వైద్యులు. వీర్య కణాలకు ఉండే తోక అటూ ఇటూ కదులుతూ ఉంటుందని, దానికున్న శక్తి, వీర్యం ముందుకు కదిలే శక్తి కన్నా పదింతలు ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. వీర్య కణాలు ఈత కొట్టగలవని, ప్రక్రియలో స్విమ్మింగ్ కొద్దిసేపే జరుగుతుందని, అండానికి చేరువవుతున్న సమయంలోనే ఈదుతాయని నిపుణులు వివరిస్తున్నారు. అండానికి దానంతట అది కదిలే సామర్థ్యం ఉండదని, వాహికలలో ఉండే సిలియా (వెంట్రుకల వంటివి) అండం కిందకు ప్రయాణించడానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అండం ఫెలోపియన్ ట్యూబ్ వెంట గర్భాశయం వైపు కదులుతూ, కీమోఆట్రాక్టర్లు అని పిలిచే రసాయన అణువులను స్రవిస్తుందని చెబుతున్నారు. ఇవి వీర్య కణాలను ఆకర్షించి, అండ వైపుకి చురుకుగా నడిపిస్తాయని అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ లక్ష్యం ఒక చక్కటి బిడ్డను అందించడమేనని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.