తాండూరు ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు

తాండూరు: వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కనిపించడం లేదంటూ పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తాండూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నిర్బంధం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన రోహిత్‌రెడ్డి అదృశ్యంపై.. ఆయన్ను గెలిపించిన నేతలు, ప్రజలు ఆందోళనతో ఉన్నారని, ప్రగతి భవన్‌ నుంచి వెంటనే బంధ విముక్తున్ని చేయాలని డిమాండ్‌ చేశారు. ఇరవై రోజులుగా ఎమ్మెల్యే కనిపించడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అదేవిధంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎన్నో అనుమానాలున్నాయని, వాటిని ఎమ్మెల్యేలే నేరుగా నివృత్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయనతో పాటు నాయకులు ఉత్తమ్‌చంద్‌, జనార్దన్‌రెడ్డి, లింగదళి రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.