తాండూరు ఎమ్మెల్యేకు విముక్తి

తాండూరు: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఘటన తర్వాత 22రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో.. ప్రగతి భవన్‌, ఫాంహౌస్‌లో ఉన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శనివారం ప్రగతి భవన్‌ నుంచి పూర్తిస్థాయిలో బయటికి రానున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం స్వయంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డే స్వయంగా ప్రకటించారు. ఆదివారం రోహిత్‌రెడ్డికి తాండూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 22 రోజులపాటు ప్రగతి భవన్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి తాండూరు ప్రాంత అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు కృషి చేశారు. తాండూరు ప్రాంత సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గరుండి వివరించే సువర్ణావకాశం దక్కిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇకపై తాండూరు నియోజకవర్గానికి అత్యధిక సమయం కేటాయించి అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పల్లెపల్లెకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. ఎక్కడ అభివృద్ధి పనులు అవసరం ఉన్నాయో.. జనం మధ్యనే గుర్తించనున్నారు. 22 రోజులుగా ముఖ్యమంత్రితో ఏర్పడిన అనుబంధం, చనువు వల్ల తాండూరు ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు రాబోతున్నాయని రోహిత్‌రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు ఈసారి టికెట్‌ తనకే వస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రోహిత్ రెడ్డి శనివారం అయ్యప్ప మాలధారణ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published.