జామపండు తిన్నండి.. ఈ ప్రయోజనాలు పొందండి.. ?

ఏడాది పొడవునా అందుబాటులో ఉండే ఫలాల్లో జామ పండు ఒకటి. శీతాకాలంలో ఈ పండు రుచి వేరే. ప్రపంచంలో అన్ని దేశాల్లో జామపండు లభిస్తుంది. ముఖ్యంగా ఆసియా దేశాలలో విస్తృతంగా జామపండును పండిస్తారు. జామపండులో మన శరీరానికి అవసరమయ్యే అనేక గుణాలున్నాయి. కమలాపండులో కంటే ఇదు రెట్లు అధికంగా విటమిన్ ” సి ” ఉంటుంది. ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే ” కొల్లాజన్ ” ఉత్పత్తికి ఇది కీలకం. కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం జేసే ” పెక్టిన్” జామలో లభిస్తుంది . ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్‌గా ఉపయోగపడుతుంది, కణజాలము పొరను రక్షిస్తుంది. కొలెస్ట్రాల్స్‌ను తగ్గిస్తుంది. జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది షుగర్ వ్యాధికి చక్కటి ఔషధం. జామ అద్భుతమైన ఫలం, ఇది యాంటీ-ట్యూమర్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ నుండి మనకు రక్షణనిస్తుంది.

జామ ఆకు రసాన్ని వైద్యంలో వాడతారు ఇది అన్ని రకాల క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది. జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు, నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేర్సర్‌లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు. అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.