బీఆర్‌ఎస్‌ అంటే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పార్టీ: షర్మిల

మెదక్‌: సీఎం కేసీఆర్ పట్టబోతున్న జాతీయ పార్టీపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల వ్యంగాస్త్రాలు సంధించారు. బీఆర్‌ఎస్‌ అంటే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పార్టీ అని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో రైతులు చనిపోతుంటే, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌కు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అని చెప్పి 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ మహాత్మాగాంధీతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వందల మంది ఆత్మబలిదానాలు, లక్షల ఆస్తులు త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కేసీఆర్‌ మాత్రం తెలంగాణ తానే తెచ్చానని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు కేసీఆర్‌ ఇంట్లో ఎంత మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గడ్డాలు పెంచి దొంగ దీక్షలు చేశారని షర్మిల విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *