గ్రామాల అభివృద్ధ్యే ప్రధాన లక్ష్యం : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

గ్రామాల అభివృద్ధ్యే ప్రధాన లక్ష్యం : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఆర్.బి.ఎం వికారాబాద్: సోమవారం నాడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా సాయంత్రం 05:30 గంటల నుండి 11:00 వరకు వికారాబాద్ నియోజక వర్గం, మర్పల్లి మండల పరిధిలోని మొగిలిగుండ్ల, నర్సాపూర్ చిన్న తండా మరియు నర్సాపూర్ పెద్ద తండా గ్రామాల్లో పర్యటించారు.

గ్రామంలో కరెంటు సమస్య ఎక్కువగా ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రావడంతో ఎమ్మెల్యే కరెంటుకు సంబధించిన అధికారికి ఫోన్ చేసి ఆ సమస్యను వెంటనే తీర్చాలని ఆదేశించారు. ఏ గ్రామంలో అయితే నీటి సమస్య ఎక్కువగా ఉందో ఆ సమస్యను కూడా తీరుస్తాం అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *