పుట్టెడు దు:ఖంలో మహేష్ బాబు.. వాళ్లింటికి వెళ్లి అతడు ఏం చేశాడంటే..!

హైదరాబాద్: తల్లిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న మహేష్ బాబు ఇంట్లో చోరీకి ఓ దొంగ ప్రయత్నించారు. దొంగ మహేష్ బాబు ఇంటి గోడ దూకి లోపలికి వచ్చారు. మహేష్ బాబు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 81లో నివాసముంటున్నాడు. ఆయన ఇంటి చుట్టూ కరెంట్ ఫెన్సింగ్‌తో ఎత్తయిన ప్రహరీ ఉంటుంది. దానిని దాటుకుని లోపలికి వెళ్లేందుకు ఆ దొంగ ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పి కింద పడిపోయాడు. తీవ్రమైన గాయాలతో పైకి లేవలేని అచేత స్థితిలో ఆ దొంగ ఉన్నాడు. దొంగను పట్టుకొని జూబ్లీహిల్స్ పోలీసులకు సెక్యూరిటీ సిబ్బంది అప్పగించారు. దొంగకి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో మహేష్ బాబు ఇంట్లో లేరని చెబుతున్నారు. అగంతకుడిని ఒడిశా చెందిన వ్యక్తిగా గుర్తుంచారు. నిందితుడి పేరు కృష్ణ అని చెబుతున్నారు. అతను పూర్తిగా కోలుకున్న తర్వాత అతని నుంచి మరిన్ని వివరాలను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ బాబు ఇంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా పోలీసులు విచారించారని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.