అత్తాపూర్లో ఉగ్ర రూపం దాలుస్తున్న కారోన

అత్తాపూర్లో ఉగ్ర రూపం దాలుస్తున్న కారోన

రంగారెడ్డి,రాజేంద్రనగర్: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కారోన మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తూ లక్షల్లో ప్రాణాలను బలితీసుకుంటుంది. అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని బ్రతకల్సిన దౌర్భాగ్య స్థితిలో మనుషులు ఉండాల్సి వస్తోంది.

హైదరాబాద్ విషయానికొస్తే రోజు రోజుకి కారోన కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోనే రోజు వందల్లో కారోన కేసులు నమోదౌతున్నాయి.

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్లో కూడా కారోన కేసుల సంఖ్య తీవ్రంగా నమోదౌతున్నాయి. లాక్ డౌన్ సమయంలో కాస్త తక్కువ కేసులు నమోదైన లాక్ డౌన్ తర్వాత అత్తాపూర్లో నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఇప్పటికే అత్తాపూర్లోని పలు గేటెడ్ కమ్యూనిటీ లో కారోన విలయతాండవం చేస్తోంది. ఎక్కువగా కారోన కేసులు నమోదైన గేటెడ్ కమ్యూనిటీ లను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు.

అత్తాపూర్లో ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లుగా జనప్రియ, అంబిఎన్స్ పోర్ట్, శిఖర బ్లిస్స్ లను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు.

 

Leave a Reply

Your email address will not be published.