కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని కేసీఆర్ నిర్ణయం
ఆర్.బి.ఎం హైదరాబాద్: కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందంతో వెళ్లనున్నారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ భేటీ అవుతుంది. భేటీ అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు. యాసంగి వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్సభ, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో పండిస్తున్న వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలోనే కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దాన్యం కొనుగోలుతో పాటు రాష్ట్రనికి రావాల్సిన హక్కులపై కేంద్ర మంత్రులను కేసీఆర్ కలవనున్నారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు ఢిల్లీలోనే ఉండాలని ఆయన భావిస్తున్నారు.
