ప్రాణం తీసిన విద్యార్థి బ్యాక్ లాగ్స్..

ప్రాణం తీసిన విద్యార్థి బ్యాక్ లాగ్స్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హాస్టల్ భవనం పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి పై వివరణ ఇచ్చిన ఏసీపీ. మిర్యాల గూడ ప్రాంతానికి చెందిన చంద్రిక మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతుంది. కరోనా నేపథ్యంలో చంద్రిక గత కొద్దీ రోజులుగా వారి స్వగ్రామంలోనే ఇంటి వద్దే ఉంటుంది . అయితే తాజాగా కళాశాలలు ప్రారంభం కావడంతో చంద్రిక తాను చదువుతున్న హాస్టల్ కు చేరుకుంది. చంద్రిక తన స్నేహితులలాగా చదువు పై ద్రుష్టి పెట్టలేకపోయింది అప్పటికే తనకు బ్యాక్ లాగ్స్ ఎక్కువైపోయాయి అవి తనకు భారంగా అనిపించి తీవ్ర మనస్థాపానికి గురైంది. దీనికి తాను చనిపోవడమే పరిష్కారం అని భావించిన చంద్రిక హాస్టల్ భవనం పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది అని ఏసీపీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.