ఎమ్మెల్యే అసమర్థతతో ప్రారంభానికి నోచుకోని మంచిర్యాల జిల్లా మెడికల్ కళాశాల: రఘునాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
ఆర్.బి.ఎం: మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనగా ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం కాకపోవడానికి స్థానిక ఎమ్మెల్యే అసమర్థతే కారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆరోపించారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కౌన్సిలింగ్ ప్రారంభం కాగా జిల్లా కేంద్రం మంచిర్యాల లో మాత్రం కళాశాల ప్రారంభానికి నోచుకోలేదని అంతే కాకుండా జిల్లా కేంద్రంలో ఊరిలోనే మెడికల్ చుదువుకుందాం అనుకునే జిల్లా విద్యార్థులకు కౌన్సిలింగ్ లో మంచిర్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల పేరు లేక పోవడం అన్యాయం జరుగుతుంది అని పేర్కొన్నారు. అంతే కాకుండా దీనికి గల ముఖ్య కారణం మార్కెట్ యార్డులోని రేకుల షెడ్డులోమెడికల్ కళాశాల ఏఏర్పాటు చేయడం ద్వారా అనుమతి రాకుండా పోయిందని స్థానిక ఎమ్మెల్యే అసమర్థతే కారణమని విమర్శించారు.
