పులుమామిడి గ్రామం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎస్ రాఘవేందర్ నియామకం

పులుమామిడి గ్రామం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎస్ రాఘవేందర్ నియామకం

పులుమామిడి బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటు..

ఆర్.బి.ఎం, పులుమామిడి: నవాబుపేట్ మండల పరిధిలోని పులుమామిడి గ్రామం బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎస్ రాఘవేందర్ నియామకం

ఈ సందర్భంగా ఎస్ రాఘవేందర్ ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకంతో గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు నవపేట్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డికి  హృదయపూర్వక ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పై ఆయన మండిపడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా లేరని రాఘవేందర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంవి స్కీములు కావు స్కామ్లు అని రాఘవేందర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను పక్కదారి మళ్లించేందుకు ప్రజలను ఏదో విధంగా ఇబ్బందులకు కాంగ్రెస్ ప్రభుత్వం గురిచేస్తుంది ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు అందాల్సిన పథకాలను వెంటనే వారికి అందేలా చర్యలు తీసుకోవాలని రాఘవేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి మళ్లీ తమ ఇంటి పార్టీ బీఆర్ఎస్ ను అధికారంలోకి కచ్చితంగా తీసుకొస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కు పూర్తిగా వ్యతిరేకత ఉందని అందరూ బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి నేను సిద్ధమంటూ ఆర్బీఎం మీడియాతో మాట్లాడుతూ రాఘవేందర్ అన్నారు.

పులిమామిడి గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఎస్. రాఘవేందర్ నియామకం కాగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అమృత్ రెడ్డి, డి. సురేష్ ,ఉపాధ్యక్షులుగా యు .అమరేందర్, ఎండి ఇబ్రహీం ,ప్రధాన కార్యదర్శిగా చిన్నోళ్ల రవీందర్ రెడ్డి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఎల్. లక్ష్మణ్, కోశాధికారిగా మణిందర్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా ఎల్. సాయికుమార్ ,సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎండి షాబాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా అనంతయ్య, బీసీ సెల్ అధ్యక్షులుగా జి .లక్ష్మయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఎండి .అప్రోజ్ ఖాన్ ,రైతు అధ్యక్షులుగా ఉరడి .శేఖర్, యువజన విభాగం అధ్యక్షులుగా ఎండి సాదక్ ,అధికార ప్రతినిధులుగా ఎస్. రవి, మహిళా విభాగం అధ్యక్షులుగా షాహిదాబేగం ,కార్యవర్గ సభ్యులుగా మధుసూదన్ రెడ్డి, రాజ్ కుమార్, ప్రభాకర్ ,చరణ్, ఫిర్దోస్ఖాన్ ,శ్రీనివాస్, శివ శంకర్ రెడ్డి తో గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు దాన అనిల్ కుమార్ ,సీనియర్ నాయకులు పర్మ రెడ్డి ,బుచ్చిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *