మీరు నాన్ వెజ్ ప్రియుల..అయితే ఈ వార్త చదవాల్సిందే…

మీరు నాన్ వెజ్ ప్రియుల,..అయితే ఈ వార్త చదవాల్సిందే…

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మన దేశంలో డెబ్బై శాతం పైగా నాన్ వెజిటేరియన్లు ఉన్నారు. చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కొంతమంది దీన్ని ఇష్టంతో తింటే మరికొందరు ఆరోగ్యానికి మంచిదని బలవంతంగా తింటారూ. మాంసం రుచికే కాదు దీని వలన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి, దీంట్లో ప్రోటీన్ మరియు విటమిన్ బి12 అధికంగా ఉంటాయి. అధిక బరువు ఉన్న వారికి బరువు తగ్గడానికి మాంసం చాలా బాగా ఉపయోగపడుతుంది. మాంసం తినడం వలన కండరాల శక్తి అధికమవుతుంది. అంతేకాదు కరోనా రాకుండా ఉండడానికి మరియు కరోనా వచ్చిన వారు మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే దీనివలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు ఇదివరకే వెల్లడించారు. కరోనా నేపథ్యంలో సాధారణ రోజుల కంటే కూడా మాంసం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

సాధారణ రోజుల కంటే ఆదివారం రోజున మాంసాహారం ప్రతి నాన్ వెజిటేరియన్ ఇంట్లో వండుకుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు పొద్దున్నే లేచి నాన్ వెజ్ షాప్ కి వెళ్లి మాంసం కొనుగోలు చేస్తారు. అయితే ఈ ఆదివారం మాత్రం మాంసాహారం తినే అవకాశం లేదు, ఎందుకంటే మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు అన్నీ మూసివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని వెటర్నిటీ విభాగం అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.