రాజకీయాల నుండి తప్పుకోబోతున్న తీన్మార్ మల్లన్న..?

రాజకీయాల నుండి తప్పుకోబోతున్న తీన్మార్ మల్లన్న..?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఒప్పులను వెలికి తీసి ప్రజల వైపు నుండి అధికార పార్టీని నిలదీస్తూ తనదైన శైలిలో పదజాలం వాడుతూ తనకంటూ రాష్ట్రంలో గుర్తింపు ఏర్పర్చుకున్న సంచలన రిపోర్టర్ టీవీ యాంకర్ తీన్మార్ మల్లన్న. అధికార పార్టీ నాయకులపై ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిలా వ్యవహరిస్తుంటారు. ముక్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై రోజుకు ఒక్కసారైనా తన మాటలతో బాంబులు పేలుస్తుంటాడు. జర్నలిస్ట్ గా మొదలైన తీన్మార్ మల్లన్న ప్రస్థానం ఇప్పుడు రాజకీయాల వైపు మళ్లింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పలు వీడియోలు చేస్తూ యువతలో ఆదరణ పొందాడు. ప్రజల్లో వస్తున్న ఆదరణతో తీన్మార్ మల్లన్న మరింత ముందుకు అడుగువేసి పట్టభద్రుల ఎన్నికలో పొట్టి చేశాడు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అధికారపార్టీకి సైతం ముచ్చెమటలు పట్టించాడు. అధికార పార్టీ అభ్యర్థికి దీటుగా మల్లన్నకు ఓట్లు పోలయ్యాయి కొద్దీ ఓట్ల తేడాతో పరాజయంపాలైయ్యారు . దింతో తీన్మార్ మల్లన్న ఎన్నికల్లో ఓడిపోయారు గాని ప్రజల్లో గెలిచారని కొందరు అప్పుడు వ్యాఖ్యానించారు. తీన్మార్ మల్లన్నను తమ పార్టీలో చేరాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరగా అయన వాటిని తిరస్కరించారు. అయితే తాజాగా తీన్మార్ మల్లన్న సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో అయన చేసి వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. తీన్మార్ మల్లన్న రోజు పొద్దున తన క్యూ న్యూస్ చానెల్లో పలు వార్తల పత్రికలు చదువుతూ వాటిలోనే పలు అంశాల గురుంచి అయన మాట్లాడుతుంటారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరాడు. సాగర్ ఉప ఎన్నికలో తెరాస గెలిస్తే నేను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా అని తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ వేదికగా కేటీఆర్ కు సవాల్ విసిరాడు. అయితే తాజాగా సాగర్ ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. అయితే ప్రముఖ జర్నలిస్ట్,టీవీ యాంకర్,రాజకీయ నాయకుడు అయినటువంటి తీన్మార్ మల్లన్న అప్పుడు చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు రాజకీయాల నుండి తప్పుకుంటారా లేదా అని సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో వైరల్ గా మారింది. తీన్మార్ మల్లన్న కేటీఆర్ కు విసిరిన సవాల్ పై కట్టుబడి ఉంటారా? లేదా మాట తప్పుతారా?

Leave a Reply

Your email address will not be published.