కుటుంబకలహాలతో భార్యను కిరాతంగా చంపినా భర్త..!

కుటుంబకలహాలతో భార్యను కిరాతంగా చంపినా భర్త..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కుటుంబకలహాలతో భార్యను అతి కిరాతంగా హత్య చేసిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. భార్య షాహీన్‌ను కత్తితో అతి కిరాతకంగా గొంతు కోసి భర్త ఆసిఫ్ హత్య చేశాడు. తన భార్యను చంపడానికి ముఖ్య కారణం కుటుంబకలహాలే అని షాహిన్ తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం అంత పోలీసులకు చేరడంతో వారు ఘటన స్థలంకు చేరుకొని వివరాలు సేకరించారు. ఈమేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  భార్యా భర్తలు తరుచు గొడవపడేవారని వారి బంధువులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో భర్త హాసిఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. షాహిన్ తరుపు బంధువులు భర్త హాసిఫ్ కు కఠినమైన శిక్ష వేయాలని పోలీసులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *