ఈనెల 17 నుంచి ఆర్యజనని రెసిడెన్షియల్ రిట్రీట్

ఈనెల 17 నుంచి ఆర్యజనని రెసిడెన్షియల్ రిట్రీట్

ఆర్.బి.ఎం హైదరాబాద్: గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని ఈ నెల 17, 18 తేదీల్లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రెసిడెన్షియల్ రిట్రీట్ నిర్వహించనుంది. హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్టలో ఉన్న శ్రీరామకృష్ణ వానప్రస్థ ఆశ్రమంలో ఈ రిట్రీట్ జరగనుంది.

ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ళ వయసు వచ్చే వరకు అంటే 1,000 రోజుల వరకు గర్భిణులు పాటించవలసిన సూచనలను గైనకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు ఈ రెసిడెన్షియల్ రిట్రీట్‌లో వివరిస్తారు.

ప్రసవానికి ముందు యోగా, గాఢమైన విశ్రాంతి, శ్వాసించడం, ధ్యానం వంటివాటికి సంబంధించిన శక్తిమంతమైన చిట్కాలను తెలియజేస్తారు. బిడ్డను పోషించడం, చనుబాలు ఇవ్వడం, శిశువుకు పోషకాహారం గురించి సమగ్ర సమాచారం ఇస్తారు. గర్భధారణ, మాతృత్వం గురించి ప్రయోజనకరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు నిపుణులతో మాట్లాడవచ్చునని, అనుభవజ్ఞులైన దంపతులు, తల్లులతో సంభాషించవచ్చునని ఆర్యజనని నిర్వాహకులు తెలిపారు.

రెసిడెన్షియల్ రిట్రీట్‌‌కు హాజరుకావాలనుకునేవారు https://aaryajanani.org/pregnancy-retreat-registration-form/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 9603906906 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.