భార్యల మీద ప్రేమ తండ్రికి శాపం.. అనంతగిరి అడవుల్లో వదిలి వెళ్లిన కసాయి కొడుకులు..

భార్యల మీద ప్రేమ తండ్రికి శాపం.. అనంతగిరి అడవుల్లో వదిలి వెళ్లిన కసాయి కొడుకులు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఒక్క తండ్రి తన కుమారులను పెంచి పోషించి ఒక ఉన్నతమైన స్థాయికి తేవడానికి ఆ తండ్రి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కొడుకులకు సుఖానిస్తాడు. తల్లి పిల్లలకు జన్మనిస్తే తండ్రి వారికీ జీవితనిస్తాడు. కానీ నేటి సమాజంలో చదువుకున్న ముర్కులుకూడా తల్లి తండ్రులను అనాధాశ్రమంలో వదిలి వెళ్తున్నారు. కానీ పెంచిన తల్లి తండ్రులకంటే ఇప్పుడు వారికీ భార్యలే ఎక్కువైపోయారు. కొందరు కసాయి కొడుకులైతే తల్లి తండ్రులను చూసుకోలేక ఏకంగా చంపడానికి కూడా వెన్నక్కిపోవడం లేదు. ఎటు పోతుంది సమాజం తల్లిదండ్రులు అంత భారమైపోతున్నారా. మిమల్ని పుట్టిన్నపుడే చంపేస్తే ఈ రోజు వారికీ ఆ గతి పటేదా. కొడుకులు పుట్టాలని వాళ్ళు తిరగని గుడి అంటూ ఉండదు.

అయితే ఆలస్యంగా ఇలాంటి హృదయవిదారక ఘటన వికారాబాద్ పట్టణంలోని అనంతగిరి సమీపంలో చోటుచేసుకుంది. నగర శివారు నర్సింగ్ ప్రాంతానికి చెందిన గొల్ల స్వాములు అనే 60 ఏళ్ల వయసున్న వ్యక్తిని తన ఇద్దరు కుమారులు (రామకృష్ణ,పరమేష్) అనంతగిరి సమీపంలో వదిలేసి వెళ్లారు.

అనంతగిరి అడవులు నుండి నడుచుకుంటూ వికారాబాద్ కు చేరుకున్నాడు. వికారాబాద్ కోర్ట్ కు సమీపంలోని ఒక హోటల్ వద్ద దీనంగా కూర్చున్న ఆ వ్యక్తిని హోటల్ యజమాని గమనించాడు. ఎందుకు ఇక్కడ నువ్ కుర్చున్నావ్ అని అడగగా బోరున విలపిస్తూ. తాను నర్సింగ్ ప్రాంతానికి చెందిన వాడినని తన భార్య మరణించిందని అప్పటి నుండి తన ఇద్దరి కొడుకుల దెగ్గరే ఉంటున్నాని అన్నారు.

స్వాములు స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా పుల్లూరు గ్రామం. ఆ గ్రామంలో ఉన్న తమకు సంబందించిన ఆస్తులు అమ్మి నగరు శివారు నర్సింగ్ లో ఒక ఇల్లు కొని అక్కడే జీవనం సాగిస్తున్నారు. కాగా తన ఇద్దరు కుమారుల భార్యలు తనని చిత్ర హింసలకు గురిచేసేవారని కనీసం భోజనం కూడా పెట్టకుండా పస్తులు ఉంచేవారని నన్ను వదిలించుకోవడాని గత కొద్దీ రోజులుగా ఎన్నో పన్నాగాలు పన్నారని అయన అన్నారు.

చివరకు వారు అనుకున్న విధంగా నన్ను వదిలించుకున్నారు. గత నాలుగు రోజుల క్రితం తన కొడుకులు ద్విచక్ర వాహనం పై అనంతగిరి సమీపంలో వదలి వెళ్లారని వాళ్ళు ఇక్కడ వదలి వెళ్లిన విషయం ఎవరికైన చెప్తే చంపేస్తాం అంటూ బెదిరించారు అంటూ స్వాములు హోటల్ యజమాని గౌస్ కి తెలిపాడు. దానికి స్పందించిన హోటల్ యజమాని మానవ దృక్పథంతో ఆ వ్యక్తికి భోజనం వసతి కూడా ఏర్పాటు చేశాడు.

హోటల్ కు వచ్చిపోయే వారు కొత్త వ్యక్తి ఎవరని యజమానిని అరా తీయగా గౌస్ అందరికి విషయాన్ని వివరించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారాన్ని అందించారు. హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు స్వాములు నుండి స్టేట్మెంట్ తీసుకొని వికారాబాద్లోని మునిసిపల్ పరిధిలోని మహిత మినిస్ట్రీస్ అనాధాశ్రమమానికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published.