కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 మంది టీఆర్ఎస్ నేతలు..
ఆర్.బి.ఎం: పెద్దపల్లి జిల్లా మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో పలువురు టీఆరెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామగుండం పట్టణానికి చెందిన TRS పార్టీ యూత్ నాయకులు 30 మంది హైదరాబాదులోని శ్రీధర్ బాబు నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
